Listen to this article

జనం న్యూస్, మార్చి 24, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్ ఎఫ్ ఆర్మీ అధికారులు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎన్‌జీఆర్‌ఐ సింగరేణితో పాటు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సరిగ్గా నెల క్రితం ప్రమాదం జరిగి ఎనిమిది మంది చిక్కుకు పోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు నిరం తరం కొనసాగుతున్నాయి.. కేవలం, గురుప్రీత్‌సింగ్‌ పంజాబ్‌,మృతదేహాన్ని మాత్రమే రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి కాగా ఇప్పటి వరకు మరో ఏడుగురి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. అయితే, నేటి సమీక్షలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు సీఎం రేవంత్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యల కోసం రూ.ఐదు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ఎస్‌ఎల్‌ బీసీ టన్నెల్‌లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుండ టంతోపాటు టన్నెల్ చివరి యాబై మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్ గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. ఇక, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని సిబ్బంది తేల్చి చెప్పాయి. కాగా, టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ఎపిసోడ్ పై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.