

జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం)
తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అన్యాయమని ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీత, శ్రీలక్ష్మి ఉన్నారు.