

జనం న్యూస్:-13/01/2025
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వయనాడ్ ఎంపీగా ప్రశంసిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి,ఝాన్సీ రెడ్డిలు ప్రియాంక గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రియాంక గాంధీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.వయనాడ్లో భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికైనందుకు వారిని అభినందించారు.ఎన్నికల సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చారని,వారు మరోసారి పాలకుర్తి నియోజకవర్గాన్ని సందర్శించాలని,అభివృద్ధి పనులను పరిశీలించాలని కోరారు..