Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రూ.40లక్షలవ్యయంతో ఏర్పాటు చేసిన 100 హెచ్ పి మోటర్ మంచినీటి మోటర్ పంప్ సెట్ ను ప్రత్తిపాటి ప్రారంభించారు. మంత్రి నారాయణ రూ. 4 కోట్ల నిధులు సిసి రోడ్లకు,డ్రైనేజీలకు కేటాయించారు. ప్రజలకు శాశ్వతంగా మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి పనులు జరుగుతాయి. పట్టణంలో ఉన్నటువంటి మంచి నీటి చెరువులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు.రూ.40 లక్షల వ్యయంతో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన 100 హెచ్ పి మోటర్ మంచినీటి మోటర్ పంప్ సెట్ ను ప్రత్తిపాటి ప్రారంభించారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవికాలం ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పంప్ సెట్ ను ప్రారంభించామని, ఈ పంప్ సెట్ ను ఒకరోజు ఆడిస్తే ఉన్నటువంటి మంచి నీటి ట్యాంకర్లు మొత్తం నిండి మూడు రోజులు పాటు ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్నారు. అటువంటి సామర్థ్యం గల పంప్ సెట్ ను అధికారులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సుమారు 2058 సంవత్సరాల వరకు ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండు సంవత్సరాలపాటు పనులు నిర్వహిస్తే ప్రజలకు నీటి కష్టాలు తప్పుతాయని, దానికి సంబంధించిన టెండర్లు పిలుస్తున్నామన్నారు. అమృత స్కీమ్ సంబంధించిన నిర్వహకులు ఎక్కడపడితే అక్కడ గుంటలు వేసి ఎటువంటి పనులు చేయలేదని మెగా స్కీమ్ నిర్వాహకులు ప్రజలకు సౌకర్యార్థం అన్ని పనులు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాని ప్రజలు గమనించాలన్నారు. మంచి అధికారులు ఉంటే పనులు జరుగుతాయనే దానికి ఇదే నిదర్శనం అన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ రూ. 4 కోట్ల నిధులు సిసి రోడ్లకు,డ్రైనేజీలకు కేటాయించారన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు అన్ని పనులు జరుగుతాయన్నారు. *రజిని ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రి అనేసుస్థిరాన్ని సంపాదించుకుంది: ప్రత్తిపాటి. రాష్ట్రంలో అవినీతి మంత్రి అనే ముద్రను మాజీ మంత్రి విడదల రజిని కైవాసం చేసుకున్నారన్నారని,వైసీపీ చెందిన వారే కోర్టుకు వెళ్లారని ప్రత్తిపాటి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య ఆరుసార్లు పోటీ చేశారు.నేను 6 సార్లు పోటీ చేశాను. మా మీద కోర్టుకు ఎవరూ వెళ్లలేదని, ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రి అనే సుస్థిరాన్ని ఆమె సంపాదించుకున్నారని, ఎన్నికల్లో గుంటూరుకి పంపిస్తే తిరిగి మళ్ళీ చిలకలూరిపేటకు వచ్చి బీసీ మహిళను అంటే సింపతి వర్కౌట్ అవ్వదన్నారు. మీడియా ముందు పూనకం వచ్చినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురించి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అవినీతి సొమ్మును కక్కిస్తాం… చట్టపరంగా శిక్షిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.