

జనం న్యూస్ మార్చి 24 కాట్రేనికోన
అమలాపురం ఈఎస్ఎన్ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తమ అసమాన పోరాటంతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ ముగ్గురు వీరులు, చిన్న వయసులోనే దేశం కోసం బలిదానం చేసిన రోజు. ఆ వీరులు ప్రాణత్యాగం చేసిన నాటి రోజునే వారి జ్ఞాపకార్ధం షహీదీ దివాస్‌గా ప్రకటించారు. ఆ ముగ్గురూ భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు నాటి తరానికే కాదు, నేటి యువతకు కూడా ఆదర్శం. ఉరి కంబం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరిగిపోనివ్వని ఈ యోధులు, చావును కూడా ఎంతో సంతోషంగా స్వీకరించారు. 1931 మార్చి 23 న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ హుస్సైన్‌వాలా ప్రావిన్స్ జైల్లో ఈ వీరులను ఉరికి బలిచ్చారుప్రధమ తెలియజేశారు అనంతరం ఇంచార్జి vsn మూర్తి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల పట్ల మనందరం అంకితభావంతో ఉండాలని వారిని మనం సదాస్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్ వై కే వాలంటీర్లు ఈశ్వర్ ,సరోజిని మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
