Listen to this article

జనం న్యూస్ 24మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

కొత్తగూడెం : రంజాన్ పండుగ సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో అయన సోమవారం మున్సిపల్, పొలిసు, పంచాయతి రాజ్ శాఖల సబ్ డివిజన్, మండల స్థాయి అధికారులకు సోమవారం ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. ఉపవాస దీక్షలు, రంజాన్ పండుగ సందర్బంగా మజీదులు, బస్తీలు, గ్రామాల్లో ఇఫ్తార్ విందులు, ప్రేత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయని ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, విధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్ఘాలు, మజీదులు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం, పారిశుధ్యం చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పండుగ రోజు ప్రార్ధనలు నిర్వహించే ఈద్ఘాలు వద్ద జరిగే ప్రార్ధనల సందర్బంగా త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పండుగ ఉత్సవాలు ప్రశాంతగా జరిగేలా చర్యలు తీసుకోవాల ఆదేశించారు