

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం
చాకలిపాలెం కృష్ణ బాలాజీ పంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కు విశేష స్పందన లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు (బాబి) ఆధ్వర్యంలో జరిగిన వివాహ పరిచయ వేదికకు 750 మంది యువతీ, యువకులు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. సుమారు 10 నుండి 20 జంటల వరకూ వివాహం కుదుర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళ్లపు శివ రామ సుబ్రమణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం వివాహ పరిచయ వేధికతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. దీని వలన యువతీ యువకులు వారి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకో వడానికి, ఒకరి ఆలోచనలు మరొకరు తెలుసుకోవడం, ఒకరిని నొకరు అర్థం చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పరిచయవేదిక ద్వారా వివాహం కుదుర్చుకున్న వారి వివాహానికి అవసరమైన సహాయం ఆర్యవైశ్య సంఘం ద్వారా అందిస్తామని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని పరిచయ వేధికలు ఏర్పాటు చేసి సామూహిక వివాహా లు చేసేలా కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో ప్రగళ్ళపాటి కనక రాజు, రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీను, లక్కింశెట్టి బాబులు, కుసుమంచి పాపారావు, కంచర్ల కృష్ణ మోహన్,గ్రంథి గణేష్ గుప్తా,నాళం కిట్టు, పువ్వాడ కృష్ణ, ఫేకేటి సతీష్, శింగంశెట్టి కుమార్, వారణాసి శ్రీనివాస్ గుప్తా, పోశెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
