Listen to this article

జనం న్యూస్. మార్చి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్. (అబ్దుల్ రహమాన్)

హత్నూర మండలంలోని షేర్ ఖాన్ పల్లి గ్రామ పరిధిలో ప్రారంభమైన మొదటి రోజు శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి ధ్వజారోహణం అంకురార్పణ మరియు ఎల్లమ్మ కళ్యాణం ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లా గౌడ్ దంపతులు మరియు ఆలయ పాలకవర్గం , ఆలయ అధికారులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లా గౌడ్ మాట్లాడుతూ. శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ తల్లి జాతర ప్రారంభోత్సవ ఉత్సవాలు మొదలయ్యాయని అన్నారు . ఈ ఉత్సవాలలో 24 న అగ్నిగుండాలు బోనాలు, 25 నాడు బండ్లు తిరుగుతాయని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి దేవనాదం, ఆలయ పాలకవర్గం, పటేల్ దశరథ, లక్ష్మగౌడ్, శంకరయ్య తదితరులు అర్చకులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు,