Listen to this article

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం

గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో ఆర్యవైశ్య మెగా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాల నిర్వహణకు కృష్ణ బాలాజీ కన్వెన్షన్ హాల్ ను ఉచితంగా ఇచ్చిన కంచర్ల శేఖర్ ను, సహకరించిన శ్రేయోభిలాషులకు ఏపిఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాబి, వివాహ పరిచయ వేదిక చైర్మన్ క్రింది గణేష్ గుప్త అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ప్రగళ్లపాటి కనకరాజు, ప్రధాన కార్యదర్శి కుసుమంచి పాపారావు కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్, పోశెట్టి సూరిబాబు, కాసు శ్రీనివాసు, వారణాసి శ్రీనివాస్ గుప్తా, లక్కింశెట్టి బాబులు, జోనల్ చైర్మన్లు మండవెల్లి వెంకటేశ్వరరావు, బత్తుల నానాజీ, పి.గన్నవరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెంటపాటి శ్రీనివాసు, తమ్మన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు