

జనం న్యూస్, జనవరి 14, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈరోజు కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్య సహకారంతో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం కనుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కొలిపాక లక్ష్మి సత్తయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.