

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మాజీ మంత్రి విడుదల రజిని పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పై మీడియా సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మల్లెల రాజేష్ నాయుడు తో కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, పార్వతి, జాలాది సుబ్బారావు, కొలిశెట్టి శ్రీనివాసరావు,గోల్డ్ శీను వెంగళ రాయుడు, రత్నారెడ్డి, దశరథ రామయ్య, మిరియాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ పిల్లికోటి, తదితరులు వారికి జరిగిన అన్యాయాల మీద వారికి రావలసిన డబ్బులు మీద మీడియా సమావేశంలో విడదల రజనీపై నిప్పులు చెరిగారు, మాకు ఎవరికైతే అన్యాయం జరిగిందో మేమంతా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ద్వారా పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తాం, అవసరమైతే కోర్టుల ద్వారా కూడా మాకు జరిగిన అన్యాయం మీద కేసులకు వెళ్తాము అని తెలియజేశారు. అధికారంలో ఉన్నప్పుడు అందరిని మోసం చేసి అందరిని వాడుకొని అందరి దగ్గర పదవులు ఇస్తానని డబ్బులు వసూలు చేసి నియోజకవర్గంలో తప్పుడు కేసులు కట్టించి ఆనందం పొందావు. ఇప్పుడు అవే కేసులో నీ మీద చుట్టుకొనడంతో ఈరోజు నాకు అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి మీడియా ద్వారా గగ్గోలు పెడుతున్నారు అని మండిపడ్డారు. నువ్వు చేసిన పాపాలు నీకే చుట్టుకుంటున్నాయి, చిలకలూరిపేట నుండి పోయావులే అనుకుంటే మరలా చిలకలూరిపేటకు వచ్చి పిచ్చి,పిచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి మా ఎంపీ, మా శాసనసభ్యులు మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నావని హెచ్చరించారు.