

జనంన్యూస్. 24.
నిజామాబాదు. ప్రతినిధి.
భగత్ సింగ్ 94 వ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈనెల 22,23, తేదీలలో ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలకు జిల్లా నలుమూలల నుండి 40 టీములు రావడం జరిగింది అని క్రీడల నిర్వహణ ఇంచార్జ్ వి బాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారులకు శారీరక దృఢత్వాన్ని సాధించాలనే పట్టుదలను నేర్పిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం అతిధులు మాట్లాడుతూ ధర్పల్లి మండల కేంద్రంలో భగత్ సింగ్ స్మారక క్రీడలు నిర్వహించడం చాలా ఆనందం కలిగించిందని ఆయనను స్మరిస్తూ ఆయన ఆశయాలను యువత గుర్తు చేసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని వక్తలు మాట్లాడారు. అనంతరం బహుమతుల ప్రధానం చేశారు. వాలీబల్ ఫస్ట్ ప్రైజ్ కమ్మర్పల్లి సెకండ్ ప్రైజ్ వెస్లీ నాయక్ తండ కబడ్డీ
మొదటి బహుమతి వెస్లీ నగర్ తండా7000 రెండవ బహుమతి మేగ్య నాయక్ తండ3000 చెస్ మొదటి బహుమతి జలంధర్ గౌడ్ ద్వితీయ బహుమతి గంగాధర్ గౌడ్ వ్యాసరచన పోటీలు మొదటి బహుమతి జి వివేక్ లిటిల్ ఆర్ట్స్ హై స్కూల్ ధర్పల్లి రెండో బహుమతి యు సుదీక్ష మోడల్ స్కూల్ ఎం అశ్విని కస్తూర్బా పాఠశాల సాంగ్స్ ఫస్ట్ బహుమతి కృష్ణవేణి కస్తూర్బా స్కూల్ అమాని కస్తూర్బా స్కూల్ ద్వితీయ బహుమతి
తృతీయ బహుమతి లక్ష్మి రమణి లిటిల్ ఆర్ట్స్ హై స్కూల్ ఫోర్త్ బహుమతి సౌజన్య కస్తూర్బా హై స్కూల్
బీడీలు చుట్టుట ప్రథమ బహుమతి బోండ్ల శైలజ ద్వితీయ బహుమతి గైండ్ల రమ్య లు బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి మాజీ ఎంపిటిసి చెలిమెల నరసయ్య నూకల గంగాధర్ గడ్డం మోహన్ గడ్డం తిరుపతిరెడ్డి ఎల్ఐసి అతికం శ్రీనివాస్ ఎల్ఐసి దాసు లు బహుమతులు ప్రధానం చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పూరు భూమయ్య, సాయి రెడ్డి, దేవ స్వామి కారల్ మార్క్స్, నిమ్మల భూమేష్ మల్కి సంజీవ్ ఎల్లయ్య వెంకటి పద్మ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.