

జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు.సోమవారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. అదేవిధంగా బెట్టింగ్లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.