Listen to this article

గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి.

జనం-న్యూస్, మార్చి 24,(బేస్తవారిపేట ప్రతినిధి):

ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి జనం-న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం నియోజకవర్గంలో గత 52 సంవత్సరాల రాజకీయ జీవితం గల కుటుంబం కుందురు నాగార్జున రెడ్డి కుటుంబం. విద్యావంతుడైన కుందురు నాగార్జున రెడ్డి ఎన్నో ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిగా చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అతి స్వల్ప తేడాతో ఓడిపోవడం, అయినా నిరుత్సాహ పడని కుందురు నాగార్జున రెడ్డి మరల గిద్దలూరు నియోజకవర్గంలో అప్పుడప్పుడు పర్యటిస్తూ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కుందురు నాగార్జున రెడ్డి మరల పోటీ చేయరు అని తప్పుడు ప్రచారం చేసే వారికి నేను ఒకే ఒక మాట చెప్తున్నా గిద్దలూరు నియోజకవర్గంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందురు నాగార్జున రెడ్డి మాత్రమే ఉంటారని చెప్పగలను. మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే అభివృద్ధి చెందిన పట్టణముగా ఉండడానికి కుందురు వారి కుటుంబం విశేష కృషి అని చెప్పవచ్చు. మార్కాపురం నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి, పల్లె ప్రాంతాలలో అన్ని సౌకర్యాలు కల్పించిన కుటుంబం కుందురు కుటుంబం అని చెప్పటానికి గర్వంగా ఉంది. అలానే అవినీతి రహితంగా గిద్దలూరు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదములో నడిపిస్తారని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. కానీ కొంతమంది దుష్ప్రచారం చేయడం ప్రస్తుత తాత్కాలిక ఆనందమే కానీ జరగబోయే రోజులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుందురు నాగార్జున రెడ్డి శాసన సభ్యులుగా కావడం గిద్దలూరు నియోజక వర్గం ప్రజలకు అవినీతి రహిత పాలన అభివృద్ధి అందించడానికి ఎప్పటికీ వారు సిద్ధమని చెప్పవచ్చని పత్రికా ముఖంగా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.