Listen to this article

జనం న్యూస్ ; 24 మార్చ్ సోమవారం;

సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27న “అట్టడుగు వర్గాల సమానత్వము- సమ్మిళిత సమాజం” అనే అంశంపై జాతీయ సెమినార్ జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక సెమినార్కు ముఖ్య అతిథులుగా ఉన్నత విద్య మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీసీ కమిషన్ మెంబర్ ఆర్ బాలలక్ష్మి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్యోతిరాణి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాము షెఫర్డ, ప్రముఖ రచయిత్రి కే సజయ, ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ ఎంఏ మాలిక్ తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్న తదితరులు హాజరవుతారని సెమినార్ కన్వీనర్ డాక్టర్ ఎం శ్రద్ధానందం తెలిపారు.