

జనం న్యూస్ 24 మార్చి 2024 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి,
జోగులంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలలో సోమవారం వరల్డ్ టిబి డే – మార్చ్ -24, ర్యాలీని విజయవంతం నిర్వహించారు.వరల్డ్ టీబీ డే సందర్భంగా కృష్ణవేణి చౌక్ నందు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు ఆధ్వర్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప చేతుల మీదుగా,జెండా ఊపి ర్యాలీని, ప్రారంభించారు.ర్యాలీని కృష్ణవేణి చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది మరియు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు “మనందరి పంతం- టీబి అంతం “అని నినాదాలు ఇస్తూ ప్రజలకు టీబీ వ్యాధి నిర్మూలన గురించి అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీని పాత బస్టాండ్ వరకు కొనసాగించారు, తదనంతరం,పాత బస్టాండ్ సర్కిల్ లో టీబీ వ్యాధిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారి వైద్య సిబ్బంది మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు, తదనంతరం టీబీ వ్యాధి తగ్గించడంలో కృషి చేసిన వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి, పాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు,మరియు టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు… ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, మరియు ఆర్ఎమ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్లు, మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, టీబీ ఎస్టిఎస్ సూపర్వైజర్లు, నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.