

జనం-న్యూస్, మార్చి 24, (కంభం ప్రతినిధి):
ప్రకాశం జిల్లా, కంభం మండలంలో జరిగే పదవ తరగతి పరీక్ష కేంద్రాలు వాసవి జూనియర్ కళాశాల, చైతన్య కాన్సెప్ట్ స్కూల్, లింగారెడ్డి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. నరసింహారావు సోమవారము ఉదయము భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష ప్రారంభ సమయంలో తమ సిబ్బందికి సూచనలు ఇస్తూ 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండనీ రాదని సిబ్బందికి సూచించారు. నిరంతరము పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పించడం జరిగింది. పరీక్షలు జరిగే సమయంలో ముందుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ఆ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ మండల పరిధిలో ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరము పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో పూర్తిస్థాయి పోలీస్ వారి నిఘా ఉంచారు. ఇప్పటివరకు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడంలో పోలీస్ వారి కృషి అభినందనీయమని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.