Listen to this article

జనం న్యూస్, మార్చి 25, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామానికి చెందిన పురాతన వరి రకాల సేకరణకర్త, సంరక్షకుడు యాదగిరి శ్రీనివాస్ ఏ ఈ ఓ రైతుసేవ విభాగం లో అవార్డు కు ఎంపిక అవగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్యనారాయణ చేతుల మీదగా హైదరాబాదులోని సుందరయ్య కళానిలయంలో సర్వేజనా సుఖినోభవంతు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాలు 2025 కార్యక్రమంలో స్వర్ణ నంది అవార్డును అందుకోడం జరిగింది. వరి విత్తనాలపై విభిన్న పరిశోధన చేస్తూ , పూర్వకాల విత్తనాలను సేకరిస్తూ వాటిని వివిధ ప్రయోగాత్మక పద్ధతిలో పెంచుతూ జాతి సంపదను కాపాడుతున్న యాదగిరి శ్రీనివాస్ కృషి అభినందనీయం. ఈరోజు అవార్డు తీసుకొని స్వగ్రామానికి విచ్చేసిన యాదగిరి శ్రీనివాస్ ను మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే , కొత్త మార్పులకు నాంది పలుకుతున్న శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు, ఈరోజు జాతీయస్థాయిలో కల్వచర్ల గ్రామాన్ని పేరు తీసుకెళ్లినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో రాపెల్లి రమేష్,ప్రసాద్,సిలివేరి అభి పాల్గొన్నారు.