Listen to this article

జనం న్యూస్, మార్చి 25, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోణి మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లను చేరుకొన్న సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల వివరాలు, గతం జరిగిన సంఘటనల వివరాలు,ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. ప్రాంత లోని సానుభూతి పరులు, మిలిటెంట్స్, మావోయిస్టులకు సంభందించి మరియు వారి కదలికలు అధికారులను, సీనియర్ సిబ్బంది అడిగి తెలుసు కోవడం జరిగింది. సిబ్బంది విధుల్లో ఎల్లపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది తో మాట్లాడి వారి వివరాలు, చేస్తున్న విధులు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎన్ ఐ బి ఇన్స్పెక్టర్ కర్ణాకర్, చెన్నూర్ రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్ ఐ శ్యామ్ పటేల్ ఉన్నారు.