

మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు
మోడల్ స్కూల్ నందు ఘనంగా శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహణ
దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ కలల్ని ఆటపాటలతో కండ్లకు కట్టినట్టు ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులు
జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు కలలకు నిలయం మన భారతదేశం అని మండల విద్యాశాఖ అధికారి పిడతల వెంకటేశ్వర్లు అన్నారు, సోమవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ నందు పాఠశాల విద్యార్థులు శ్రేష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల ఆచార సంప్రదాయాలను,మరియు వారి సంస్కృతి, వారి ప్రాచీన కళల్ని కండ్లకు కట్టినట్టు వేదికపై ప్రదర్శించి అబ్బురపరిచారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారత దేశ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప నినాదంతో దేశ సమైక్యత సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ తన యొక్క ఆచార సాంప్రదాయాలను పరస్పరం గౌరవించుకుంటూ పాటించుకుంటూ ,స్వాతంత్ర ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తున్నారని, అలాంటి గొప్ప వారసత్వ కళాఖండాలను పాఠశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, వారిలో దేశం పట్ల సమాజం పట్ల ఆచార్య సాంప్రదాయాల పట్ల భారతదేశ కుటుంబ వ్యవస్థ పట్లఅనుభవ పూర్వకంగా నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని వారన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియు చిన్నారులు ప్రత్యేక అలంకరణలో ముస్తాబై ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను నృత్యాలను కలల్ని ప్రదర్శించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్, మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

