

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు గల మహాత్మ జ్యోతి భాపులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల యందు ప్రిన్సిపాల్ నాగేశ్వరీ అధ్యక్షతన అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాజంపేట డివిజనల్ టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ శరత్ కమల్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. క్షయ వ్యాధి నివారణ పై విద్యార్థినులకు వకృత్వ పోటీలను నిర్వహించి విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె యస్ కె కో ఆర్డినేటర్ రాజశేఖర్, పాఠశాల స్టాఫ్ నర్సు కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.