


▪️ కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా..
▪️ నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్..
జనం న్యూస్ // మార్చ్ //25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి యు సి ఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో, కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐ ఎన్ టి యు సి,) అధ్యక్షులు గా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, బేతీగల్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా.. అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ..నా నియామకానికి కృషి చేసిన కార్మిక సంఘం నాయకులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నియామకం ద్వారా అసంగటిత కార్మికులు మరియు సంగటిత కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, వారు అన్నారు.