Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట//కుమార్ యాదవ్..జమ్మికుంట మండలం వావిలాల గ్రామం లో మేడిపల్లి పవన్ కళ్యాణ్ అనే వక్తి పవన్ కమ్యూనికేషన్ అను మీ సేవ కేంద్రంను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అధికారుల అండదండలతో మరియు డబ్బు పరపతి తో మీసేవ కేంద్రాన్ని మంజూరు చేయించుకున్నాడు అని మామిడి రాజు తెలిపారు. అతనికి సరియిన కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, అని మరియు అతను జమ్మికుంట పట్టణం నందు సెలూన్ షాప్ మరియు ఫైనాన్స్ పెట్టి నడిపిస్తూన్నాడు అని అన్నారు. ఇట్టి మీ సేవ కేంద్రమును సరిగా నడపకుండ నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నాడని, మాట్లాడారు.ఇట్టి మీసేవ కేంద్రాన్ని వావిలాల గ్రామములోని తన ఇంటి వంట గదిలో ఎలాంటి మీ సేవ బోర్డు మరియు మీ సేవ చార్ట్ లేకుండా సరియిన సమాచారం పాటించకుండా, సాయంత్రం నడిపిస్తూ అధిక ధరలు వసూలు చేస్తున్నాడన్నారు. ప్రజలు ఏం అయ్యిన సందేహాలు,గాని, ధరల గురించి అడిగితే తనకూ ఉన్న నాయకుల అండదండలు చూసుకొని ప్రజలను బెదిరిస్తున్నాడన్నారు. ఇట్టి మీసేవ కేంద్రం అడ్రస్ మా యొక్క గ్రామం వారికి మరియు చుట్టూ పక్కలా గ్రామాల వారికి కూడా ఎక్కడ వుందో తెలియదన్నారు. ఇట్టి మీసేవ కేంద్రం తనకూ నడుపుటకు చేతకాక దీనిని వేరే వారికి రూ”200000/లకు అమ్మకానికి పెట్టడం జరిగింది అని వివరించారు.ఇట్టి మీసేవ కేంద్రం పైన సరియైన విచారణ జరిపి, రద్దు చేసి మా గ్రామంలో అర్హత కలిగిన & కంప్యూటర్ వచ్చిన గ్రామ యువకులకు అవకాశం ఇప్పించగలరని, మా చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు యొక్క ఇబ్బందులు తీర్చగలరని,
మామిడి రాజు తెలిపారు.