Listen to this article

జనం న్యూస్, మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత కొద్దీ రోజుల క్రితం పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతీ దిక్కుతోచని స్థితిలో ఉందని సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణలత అక్కడికి చేరుకొని, అక్కడ చుట్టూ ప్రక్కన వారిని ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్తించగా ఆమె వారం రోజుల నుండి ఎం. బి ఫంక్షన్ దగ్గర ఉంటుందని తాను ఎక్కడి నుండి వచ్చిందో కుడా తెలీదని చెప్పడం తో వెంటనే ఆమె ని హైదరాబాద్ లో గల చోటుప్పల్ దగ్గర అమ్మ నాన్న ఆశ్రమానికి సఖి సిబ్బంది సహకారం తో తరలించడం జరిగింది. ఇందులో సఖి సి ఎ స్వప్న, సూపరింటెండెంట్ రాజయ్య, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, పోలీస్ సిబ్బంది, సఖి ఎం టి ఎస్ కవిత తదితరులు ఉన్నారు.