

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ , ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందు క్రికెట్ బెట్టింగ్లు పాల్పడి, కేసుల్లో ఉన్నవారిని మరలా క్రికెట్ బెట్టింగ్ ల జోలికి వెళ్లకుండా హెచ్చరించడం జరిగింది. దేశంలో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన నేపథ్యంలో, బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశముండటంతో బెట్టింగ్ కు పాల్పడే వారిపై మరియు బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ, ప్రజలకు ముఖ్యంగా యువతకు ముఖ్యమైన హెచ్చరికలు చేశారు.క్రికెట్ అనేది భారతదేశంలో ఒక ఆట కంటే ఎక్కువ, ఇది ఒక భావోద్వేగం, ఒక సంస్కృతి. కానీ ఈ ఆటను ఆస్వాదించడం ఒకటైతే, దానిపై బెట్టింగ్ చేయడం మరొకటి. బెట్టింగ్ అనేది ఒక వినోదం కాదు, అది ఒక వ్యసనం, ఒక విష చక్రం, ఇది జీవితాలను నాశనం చేస్తుంది. బెట్టింగ్ వల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోయి, అప్పుల ఊబిలో పడుతూ, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో తీవ్ర ఒత్తిడితో బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన వారు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకుంటున్నారు.క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా పోలీసువారికి తెలియజేసినట్లయితే క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకో బడుతుందని తెలియజేయడమైనది.