

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకపోవడం బాధాకరమని ఏబీవీపీ విజయనగరం విభాగ్ కన్వీనర్ బొబ్బాది సాయికుమార్ అన్నారు. సోమవారం కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటై దాదాపు ఏడేళ్లు అవుతున్నప్పటికీ నేటి వరకు సొంత భవనం లేదని సమస్య పరిష్కరించాలన్నారు.