

జనంన్యూస్. 25 నిజామాబాదు. ప్రతినిధి :2025 మార్చి 27 తేదీన డిచ్పల్లిలో జరిగే గ్రామపంచాయతీ విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో 25 మార్చి తేదీన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.దాసు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి జనారోగ్యం కోసం పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఆరోగ్యం నినాదాన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని, ఇప్పటికీ దేశంలో ప్రజలు అనేక భయంకర వ్యాధులతోబాధపడుతున్నారని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత లో సఫాయి కార్మికులు క్రియాశీలంగా కృషి చేస్తున్న, కార్మికులకు ఉపాధి పద్ధతి లేదు ఆర్థికంగా చేయూత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని ఆయన తెలిపారు. కార్మికుల క్రమబద్ధీకరణ కోసం, మెరుగైన జీవనం కోసం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసి ఉద్యమ తీవ్రత పెంచుటకు విలీన సభ దోదపడుతుందని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలం గన్ పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఫంక్షన హాల్లో ఉదయం 11 గంటలకు కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు .ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా నాయకులు పోశెట్టి, నర్సంగ్పల్లి గంగన్న, నరాటిలక్ష్మణ్, సుధాకర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.