Listen to this article

జనం న్యూస్ // మార్చి // 25//జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన జంగం చందు (24) అని యువకుడు వరంగల్ మిల్స్ కాలనీకి చెందిన గుళ్ళ మహిత (23) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని, జమ్మికుంట పోలీసులను ఆశ్రయించారు. చందు, మహిత ల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని జీవితాంతం కలిసి ఉంటామని వారు ఇద్దరు, పోలీసులకు మరియు కుటుంబ సభ్యులకు తెలపారు. వారిద్దరూ మేజర్లు కాబట్టి చట్టపరంగా నేనేమి చేయలేనని మీరే కూర్చొని మాట్లాడుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు సిఐ వరగంటి రవి తెలిపారు. తదనంతరం ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు మాట్లాడుతూ… ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నా మని అనంతరం ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయామని, ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత కలిసి ఉందామని నిర్ణయించుకోగా, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం జమ్మికుంట పోలీసులను ఆశ్రయించడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు.