Listen to this article

ఉడికి ఉడకని చికెన్ తినడం వలనే 12మంది అస్వస్థకు లోనయ్యారు

జనంన్యూస్ మార్చి 25 బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో నూకల రవి అనే వ్యవసాయ రైతు దగ్గర ఉన్న 12 మంది వలస కూలీలు సోమవారం రాత్రి ఉడికి ఉడకని చికెన్ తినడం వలన అస్వస్థకు లోనయ్యారని ఈ విషయం తెలుసుకున్న పేరూరు వ్యైద్య సిబ్బంది సకాలంలో స్పందించి వారు నివాసం ఉంటున్న ప్రదేశానికి ఒక టీం ను పంపించి వైద్య పరీక్షలు చేసి చికిత్స చేయడం జరిగినది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇవ్వడం జరిగినది అస్వస్థకు లోనైన 9 మందిని పేరూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రత ఎక్కువగా ఉన్న ఇద్దరికీ చికిత్స చేయుట, ఇద్దరికీ మలేరియా అని నిర్ధారణ అయితే చికిత్స చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో HEO వేణుగోపాల్ కృష్ణ,నర్సింగ్ ఆఫీసర్ రమ, HA శ్రీను, HA జయంత్ లాల్,LT అశ్విని తదితరులు పాల్గొన్నారు