

జనంన్యూస్.25 : నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి మరియు మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురు వ్యక్తులకు ఆర్మూర్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల పేర్లు పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన గొల్లపురం గంగారం, వడ్డేటి రాజేందర్, తాళ్లరామడుగు గ్రామానికి చెందిన లింబాద్రి,రాజు, ధర్పల్లి గ్రామానికి చెందిన భూక్య శ్రీనివాస్, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంపత్, దుబ్బాక గ్రామానికి చెందిన కర్రోళ్ల గోపి కీ రెండు రోజులు జైలు శిక్ష విధించడం అయినది ఇకపై ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం కానీ మద్యం త్రాగి వాహనాలు నడిపిన గాని కఠిన చర్యలు తీసుకుంటామని సిరికొండ ఎస్సై ఎల్ రామ్. సూచించనైనది.