


బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందను మున్సిపాలిటీగా ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ రమేష్ సెట్ కార్, శాలువాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కృషితో జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పడడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు, ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు