Listen to this article

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం బిచ్కుంద ను మున్సిపాలిటీగా ప్రకట చేసినందుకు బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్పల్లి సంతోష్ ,బిచ్కుంద మున్నూరు కాపు టౌన్ అధ్యక్షుడు సాయిని అశోక్, మరియు సోపాన్ సార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సోపాన్ సార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో జుక్కల్ నియోజకవర్గం లో బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పడటం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగనాథ్ బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, పండరి, హాజీ బాల్రాజ్, తుకారం, హనుమంతరావు దేశాయ్, బాలకృష్ణ, అరవింద్ సార్, సాయిని బసవరాజ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు