

▪️ ధర్మారం ప్రాథమిక పాఠశాలకు బీరువా, కుర్చీలు, టేబులు, పెన్నులు,నోటుబుక్కులు పంపిణీ..

జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాల కు అడ్వాంట సీడ్స్ ఆర్గనైజర్ ఎల్లంకి తిరుపతిరావు, ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా, 5 కుర్చీలు, 2 టేబుల్ల లతో పాటు విద్యార్థులకు పెన్నులు, నోటుబుక్కులు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో అడ్వంట కంపెనీ ( ఆర్ పి ఎం ) బొడిగే నాగరాజు ,మాట్లాడుతూ.. ధర్మారం గ్రామా రైతులు, అడ్వంట సీడ్స్ ద్వారా, అధిక దిగుబడి పొంది ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు, ఈ కార్యక్రమంలో కంపెనీ ఆర్ పి ఎం బోడిగే నాగరాజు ,టీపీఎం మడ్డి అంజిబాబు ,ఫీల్డ్,సూపర్వైజర్ ,సంపత్ ,రవి ,రాజుకుమార్, ఆదిత్య ,ప్రశాంత్, రమేష్ చెప్పాలా,సీడ్ ఆర్గనైజర్ ఎల్లంకి తిరుపతి రావు , పాఠశాల హెచ్ఎం తిరుపతి,వెంకటేష్ , మాజీ వార్డ్ కౌన్సిలర్ బొంగోని వీరన్న , మాజీ సర్పంచి సుధాకర్ రెడ్డి,పిల్లల తల్లిదండ్రులు రైతులు గ్రామ ప్రజలు, పాల్గొన్నారు. అడ్వట కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.