

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
జనం న్యూస్ మార్చ్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :వాంకిడి మండలం మండలం ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ సుమారు ఎన్ ఆర్ ఈ జీ ఎస్ 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగాఈ సందర్బంగా వారు మండలంలోని పలు గ్రామలలో సిసి రోడ్లను మంజూరు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లోనే జరుగుతుందని అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల రవి సీ అరుణ్ ,దెంగ్రీ పేంటు, సతీష్,దెంగ్రీ నాందేవ్, సేండ్ పేంటు, శ్రీకాంత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు