Listen to this article

సేవా రత్న పురస్కారం అందుకున్న సత్యరాజ్ ఉపారప్

జనం న్యూస్ మార్చ్ 25 జిల్లా బ్యూరో ఇంచార్జి :రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల వాసి సత్యరాజ్ ఉపారపు కి సేవా రత్న పురస్కారం వరించింది.సామాజిక సాహిత్య, సాంస్కృతిక, సేవా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో* జరిగిన స్వర్ణ నంది సేవా రత్న పురస్కార ప్రాదానోత్సవ కార్యక్రమంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ శ్రీ జస్టిస్ చంద్రయ్య చేతుల మీదుగా సామాజిక సేవకులు సత్యరాజ్ ఉపారపు సేవా రత్న పురస్కారం అందుకున్నారు.వివిధ రంగాలలో సేవలoదిస్తున్న వారిని ఎంపిక చేసి ఈ అవార్డు లు అందించడం జరిగింది. ఈ సందర్బంగా రెండేళ్ల క్రితం రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ప్రారంభించి నాటి నుండి నేటి వరకు సామాజిక సేవలో నిమగ్నమై నిరు పేదలకు, విద్యార్థులకు, అవసరమైన వారికి సహాయం అందిస్తూ సామాజిక సేవలో ముందుంటున్నారు. అనేక మంది విద్యార్థులకు సరైన దశ దిశలను నిర్దేశిస్తూ వారిని చైతన్య పరుచుటకు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన అందించిన సామాజిక సేవా కార్యక్రమాలు విశేష కృషిని గుర్తించి… వారు ఈ పురస్కరానికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జాతీయ వినియోగ దారుల మండలి అధ్యక్షులు మంధాడి కృష్ణ రెడ్డి,మహేందర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు.