


చట్టబద్దంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
జనం న్యూస్,మార్చి 26,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ,ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. అదేవిదంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడం జరిగింది. సిపి మాట్లాడుతూ … ప్రతి ఒక్క పోలీస్ అధికారి చట్టబద్ధంగా పనిచేయాలని మంచిగా పని చేసినప్పుడు తప్పుక గుర్తింపు వస్తుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం వుండాలని, ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ఎస్సీ , ఎస్టి కేసులలో న్యాయపరంగా పారదర్శకంగా విచారణ జరపాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులకు సిబ్బందికి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రకాల సమాచారం పై అవగాహనా ఉండాలి. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేసుకొని సమాచార వ్యవస్థ ను పటిష్టం చేయాలనీ, సిసి కెమెరాలు జరిగే విషయాలను గుర్తించడం జరుగుతుంది అని అదే ప్రజలతో మంచి సత్ససంబంధాలను కొనసాగిస్తే బయట చర్చ జరిగే ప్రతి ముందస్తు సమాచారం తెలుస్తుంది అని అన్నారు. దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రధాన చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవాలని సూచించారు.ప్రతి రోజు ఒక రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు, బాధితులకు కేటాయించాలి, రెండు గంటలు పెండింగ్ కేసులను సమీక్షా జరపాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు సంఘటన స్థలానికి తప్పనిసరిగా వెళ్ళాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం లభిస్తుంది అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో విలేజ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి. కిందిస్థాయి సిబ్బందితో మర్యాదగా ఏలాంటి భేదాలు లేకుండా ప్రవర్తించాలి. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవు అన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణా చేసే వారిని గుర్తించాలి కేసులు నమోదు చేయాలి, గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలనీ ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ సందర్బంగా గంజాయి స్వాధీనం కేసులలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బంది కి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఏసిపి మల్లారెడ్డి, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.