Listen to this article

జనం న్యూస్, 25 మార్చి, కుప్పానగర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా, పనికి వెళ్లి తిరిగిఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో కూలి మృతి చెందిన సంఘటన, ఝరాసంగం మండలంలోని కుప్పా నగర్ గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన చాంద్బి తన పనిని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కుప్పకూలి పడిపోయి అక్కడికక్కడే మరణించింది. తోటి కూలీలు ఆమె మరణ వార్తను ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ కు మరియు కుప్పా నగర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్నకు ఇట్టి సమాచారాన్ని చేరవేశారు. దీంతో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వసంత్, మృతురాలి కుటుంబీకులను, బంధువులను పిలిపించి, మృతదేహాన్ని వారి కుటుంబికులకు అప్పగించారు.