Listen to this article

సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్..

జనం న్యూస్ 25 మార్చి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ది ఎల్కతుర్తి విశాల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున మహాజనసభ నిర్వహించడం జరిగింది ఈ మహాసభ కి పాలకవర్గ సభ్యులు సంఘ డైరెక్టర్లు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు సభను ఉద్దేశించి సంఘం సీఈవో తిరుపతి మాట్లాడుతూ. విశాల సహకార సంఘం యొక్క అభివృద్ధి లావాదేవీలు వివరాలు రైతులకు వివరించడం జరిగింది అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ. విశాల సహకార సంఘం యొక్క పాలకవర్గం డైరెక్టర్ల రైతుల వల్ల ఇప్పటివరకు అభివృద్ధి దిశగా సాగుతూ వస్తుందని తెలియజేశారు అంతకు ముందు ఉన్న పాలకవర్గం సంఘాన్ని రెండు కోట్ల వరకు నష్టపరచడం జరిగిందని దాని రికవరీ దిశగా కోర్టులో విచారణ చేపడుతున్నామని అన్నీ కూడా సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చాయని త్వరలోనే రెండు కోట్ల రూపాయలు రికవరీ జరుగుతుందని చెప్పారు మా పాలకవర్గం వచ్చినప్పటి నుంచి సీ గ్రేడ్ లో ఉన్న ఎల్కతుర్తి విశాల సహకార సంఘాన్ని ఏ గ్రేడ్ కి తీసుకురావడం జరిగిందని అన్నారు ఇదంతా పాలకవర్గం రైతుల సహకారంతోనే జరిగిందని తెలిపారు సంఘం అభివృద్ధికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశాల సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, డైరెక్టర్లు, లోకిని సూరయ్య, బచ్చు వెంకట్రావు, కాగితాల శ్రీనివాస్, పోతరబోయిన ఐలయ్య, ముప్పు మహేందర్, ఎడవెల్లి సంధ్య, మేకల సమ్మక్క, మంతుర్తి సమ్మయ్య, బరిదుల రాజిరెడ్డి, నాగిళ్ల కృష్ణమూర్తి శర్మ, మండ పోచయ్య, విశాల రైతులు తదితరులు పాల్గొన్నారు