Listen to this article

▪️ ఆర్డీవో ఎస్ రమేష్ బాబు..

జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 274 /75/76 గల నెంబర్ లలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నివేషణ స్థలాలు కేటాయించారు. ఇట్టి స్థలంలో స్తోమతగల వారు ఇళ్ళను నిర్మాణం చేపట్టారు. ఇట్టి స్థలాలను తిరిగి ప్రభుత్వం డంపింగ్ యార్డ్ కు అనుమతించడంతో మునిసిపల్ వారు నిరుపేద నీవేషణ స్థలాలలో డంపింగ్ యార్డ్ గా మార్చుకొని చెత్తను వేయడం జరుగుతుంది. సదరు బాధితులు గత సంవత్సరం నుండి మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమకు కేటాయించిన స్థలాలను వారికి ఇవ్వాలని తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా బాధితులు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కదిలిన అధికార యంత్రాంగం సర్వేనెంబర్ 274 / 75/ 76 లలో క్షేత్రస్థాయిలో ఆర్డీవో ఎస్ రమేష్ బాబు, విచారణ చేపట్టారు. ఆర్డిఓ పరిశీలనకు వస్తున్నట్టు తెలుసుకున్న సదరు బాధితులు డంపింగ్ యార్డ్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్డీవో వద్ద తమ గోడును వెల్లబుచుకున్నారు.దీనిపై ఆర్డిఓ ఎస్ రమేష్ బాబు స్పందిస్తూ ప్రతి ఒక్క బాధితునికి న్యాయం జరిగేలా చర్యలు చేపడుతామని ఇందులో డంపింగ్ యార్డ్ కు ఎంత భూమిని కేటాయించారో, మిగతా వాటికి ఎంత స్థలాన్ని కేటాయించారు,క్షుణ్ణంగా పరిశీలించి దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్క బాధితునికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఆర్డిఓ వెంట జమ్మికుంట ఎమ్మార్వో గట్ల రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాజ్, రెవిన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం ఇకనైనా స్పందించి డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తరలించి తమ నివేషణ స్థలాల్లో హద్దులు చూపించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి వెంకన్న, పిక్కల కమల, ఏ సరిత, కృష్ణవేణి,ఎన్ పద్మ, రాజ్యలక్ష్మి, సతీష్, ఆకుల రాజేందర్, మంద సమ్మయ్య,లతోపాటు సుమారు 100 మంది బాధితులు పాల్గొన్నారు.