Listen to this article

100% పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ

వాస్తవిక బడ్జెట్ లను రూపొందించి వాటి అమలుకు కృషి చేయాలి

ఆదాయం పెంచుకునేలా పట్టణాలలో పన్నుల రీ-అసిస్మెంట్ చేయాలి

మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ బడ్జెట్ తయారీపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్, మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :అనవసర ఖర్చులు తగ్గించి, మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత కలెక్టరేట్ లో 3 మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ బడ్జెట్ తయారీపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మున్సిపల్ ఆదాయ వనరుల పై కౌన్సిల్ సమావేశంలో చర్చ నిర్వహించి ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకోవలసిన చర్యల పై దృష్టి సారించాలని అన్నారు. ‌ మన మున్సిపల్ పరిధిలో ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే మన వార్డులు డివిజన్లలో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్నదని తెలిపారు. మున్సిపల్ ఆదాయం పెంచుకున్న సందర్భంలో మనకు కావాల్సిన అభివృద్ధి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి వార్డులో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 100% పన్ను వసూలకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు.ప్రస్తుతం పట్టణాలను సుందరంగా, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందనీ, ఇంకను ఆదాయ మార్గాలు పెంచుకున్నప్పుడు పలు రకాల, మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు. పట్టణాలలో ఆదాయం మార్గాలు పెంచుకునేందుకు పన్నుల అవసరమైన చోట రీ -అసెస్మెంట్ చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యయాలు తగ్గించుకుంటూ, ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమృద్దిగా అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలనీ తెలిపారు. పట్టణాలలో ప్రాధాన్యత ప్రకారం పనులు చేపట్టాలని , ప్రజల మౌలిక వసతుల కల్పన పనులకు ముందుగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.