

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో తెలంగాణ యూనివర్సిటీ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ K. అశోక్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఒకటి మరియు రెండు ప్రోగ్రాం ఆఫీసర్స్ అవగాహన సదస్సును ఈరోజు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, మన రాష్ట్రంలో సుమారు 1,50,000 మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారని, ఎక్కువగా 15 నుండి 25 సంవత్సరాల వయసుగల వారు ఉన్నారని అన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ డాక్టర్ ప్రసన్న రాణి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పై అవగాహనన కల్పించి, గ్రామాలలో చైతన్య పరచాలని వాలంటీర్స్ ని సూచించారు. ఉపన్యాస,వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆఫీసర్లు డాక్టర్ జి. వెంకటేశం, సంజీవరెడ్డి, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ బాబు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.