Listen to this article

జనం న్యూస్ మార్చ్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం కేంద్రంలో ఐకెపి వివోఏలను మంగళవారం రోజు ఉదయం ఏఎస్ఐ మిస్పోద్దిన్ ఆధ్వర్యంలో. పోలీసులు ముందస్తు అరెస్టు చేసి చిలిపి చెడుపోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వివోఏ లు మాట్లాడుతు. సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ హామీ ప్రకారం వివోఏలకు 20 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. 20 లక్షల బీమా సౌకర్యం ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి బకాయి పడిన శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలి. వేతనాలు ప్రతినెల వ్యక్తిగత ఖాతాకి బదలాయించాలి. ప్రభుత్వ జీవో ప్రకారం గ్రామ సంఘం నుంచి 3000 రూపాయలు ఇప్పించాలి. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్ , నెట్ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. డిమాండ్ సాధన కోసం సర్ఫ్ ఆఫీస్ హైదరాబాద్ ముట్టడికి, బయలుదేరిన వివోఏలు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5000 వేతనం సరిపోవడంలేదని వారిగోడును వివరించారు. 5000 రూ/- జీతంతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది తెలియజేశారు. డిమాండ్ సాధన కోసం హైదరాబాద్ బయలుదేరిన వారిని అరెస్టు చేయడం బాధాకరమని తెలియజేశారు. కార్యక్రమంలో చిలిపి చెడు. మండల్ అధ్యక్షులు వీరమని,ఫైజాబాద్. కార్యదర్శి భాగ్యమ్మ, గౌతపూర్. కోశాధికా సరిత ,చండూర్.దైరటర్స్ మాధవి, శీలం పల్లి. రేణుక, చిట్కుల్. మమత,చిలిపి చెడు. రమణి, చిట్కుల్. తదితరులు పాల్గొన్నారు