

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు :మండలంలోని ఎంపీపీఎస్ రామచంద్రపురం పాఠశాల నందు ఐదవ తరగతి చదువుతున్న మురికిపూడి నిఖిత , కంభంపాటి జాహ్నవి ఇద్దరు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం మద్దిరాల నందు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష లో ఎంపికైనారు. వీరిరువురిని మండల విద్యాశాఖ అధికారులు ఏ. శ్రీనివాసరావు, వీవీఎస్ రత్న కళ మండల విద్యా కార్యాలయంలో విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అభినందించి సన్మానించినారు.