Listen to this article

సహాయ నిధి చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,మార్చి25,:అచ్యుతాపురం: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని యలమంచిలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. అచ్యుతాపురం మండలంకు చెందిన,చోడిపిల్లి శాంతికి రూ.58,400, వరద ఆనందరావుకి రూ.1,22,220, వారిశెట్టి నూకరాజుకి రూ.45,35,మునగపాక మండలంకు చెందిన పసుపులేటి యశోద కి రూ 2,11,576 , టెక్కలి శ్యాం సుందర్ కి రూ.50,000, వల్లూరి హర్షితకి రూ.50,950,
రాంబిల్లి మండలంకు చెందిన లాలం లక్ష్మికి రూ.30,786, వెదుళ్ల సంజీవికి రూ. 41,112, గురుబిల్లి ఎల్లారావుకి రూ.30,350, గురుబిల్లి ధనమ్మకి రూ. 45,700, ఎలమా లత కి రూ.30,000,ఎలమంచిలి మండలంకు చెందిన అంకిరెడ్డి అప్పారావుకి రూ.46,267, సిగిరెడ్డి కృష్ణకి రూ.50,592,కర్రీ నాగ జ్యోతి గోపి నాయుడుకి రూ.2,04,430 చెక్కులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..