

సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు
1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి
జనం న్యూస్, మార్చి, 26 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ. అంబర్ కిశోర్ ఝా ఐపిఎస్., ఆదేశాల మేరకు రామగుండం వి టి సి ( ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ) గోదావరిఖని లో సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ A. శంకర్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు బెట్టింగ్ లు, డిజిటల్ అరెస్ట్, ముల్టీలెవెల్లింగ్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి, www. cybercrime. gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https:// cybercrime .gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని బ్యాంక్ కస్టమర్ లకు సూచించారు. అవగాహన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అట్టెం. శంకర్, శేక్ రియాజ్, పెద్దల సంతోష్, కానిస్టేబుల్స్, కీర్తి వెంకటేష్, తిరుపతి మరియు నిమ్మతి శ్రీని వాసు పాల్గొన్నారు.