

వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్
జనం న్యూస్,మార్చి25, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ క్యాంప్ కార్యాలయంలో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు యొక్క సమస్యలుపై మునగపాక బొడ్డేడ క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ దగ్గరకు ర్యాలీగా వెళ్లి అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు సమస్యలుపై ఎమ్మార్వోకి వినతిపత్రం అందించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి & అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ రోడ్డు విస్తరణలో నష్టపోతున్నటువంటి సుమారు1200 మంది రైతులకు నిర్వాసితులకు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారము రైతులకు మరియు నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ అయినా తర్వాతే రోడ్డు పనులు చేయాలన్నది మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి&అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మరియు రెండు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు నిర్వాసితులు పాల్గొన్నారు.