

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 25 : ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఏన్కూరు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది . ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా ఏనుకూరు ప్రధాన సెంటర్వ వరకు నిర్వహించడం జరిగింది. ఈనెల 24న జరిగిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసు వర్గాలు అడ్డుకొని ఆశా వర్కర్లను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది . ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు పాల్గొని మాట్లాడారు ఆశా వర్కర్లు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇస్తానన్న 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని అడుగుతుంటే ప్రభుత్వం నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరించటం సరైనది కాదని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత స్కీమ్ వర్కర్ల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఎక్కడకక్కడ నిర్బంధిస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రజా పాలన లో ప్రజా సమస్యలు తెలుపుకునే హక్కు కూడా లేకుండా పోయిందని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లు శాంతియుతంగా తమ తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ను కలవడానికి చలో హైదరాబాద్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగించడం సరైన పద్ధతి కాదని దానిని విరమించుకొని ఆశ వర్కర్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా రూపకల్పన చేసి ఈ రాష్ట్రాన్ని స్పందింప చేస్తామని ఆయన అన్నారు ఎమ్మార్వో కార్యాలయం ముందు మానవహారం నిర్వహించి నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ జిల్లా కార్యదర్శి బానోత్ అమల, ఇనపనూరి అనురాధ, రజిత, లక్ష్మి ,రమణమ్మ ,మౌనిక, భవాని ,జ్యోతి ,అరుణ ,నాగమణి, విజయ, తదితరులు పాల్గొన్నారు.