Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా;నందలూరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి బస్సు సౌకర్యం సరైన సమయపాలన లేదని, దీన్ని వల్ల అసుపత్రులకు వచ్చే రోగులు,పల్లెల నుంచి నందలూరులో చదువు కోసం వచ్చే విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం విజయవాడలోని సచివాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో భేటిలో రాజంపేట జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ అతికారి దినేష్ తెలియజేశారు,అలాగే నియోజకవర్గంలోని పలు రాజకీయ అంశాలపై ఇరువురుచర్చించారు,అనంతరం, నందలూరు మండల వాసులు నందలూరుRS రాజంపేటRS వరకు వెళ్లే బస్సు నందలూరు రాజంపేట ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని, గతంలో ఈ మార్గంలో రెండు బస్సులు నడిచేవని డిపోకు కూడా మంచి లాభాలు వచ్చాయని ఈ బస్సు ఎత్తివేయడంతో విద్యార్థులకు, నిత్యవసరాల కోసం, వైద్యం కోసం రాజంపేటకు వెళ్లాలంటే రెండు మూడు ఆటోలను మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న ఈ బస్సును రద్దు చేయడం మండల వాసులు, అనారోగ్యంతో ఉన్న వృద్ధులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మరలా ఈ బస్సును పున రుద్ధ రించవలసిందిగా రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ అతికారి దినేష్ రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి మంత్రి దృష్టికి తీసుక వెల్లడం జరిగింది.దీనిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సానుకూలంగా స్పందించి నందలూరుRS, రాజంపేటRS బస్సును పునరుద్ధరిస్తామని అలాగే మండల పరిసర ప్రాంతాలవాసు లకు కూడా సమయానుకూలంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలియజేసినట్లు జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి తెలిపారు.