Listen to this article

20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం భూమి పూజమండల పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డ

జనం న్యూస్ 25 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమని ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి అన్నారు మండలంలోని దామెర గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో మంత్రిగారి నిధుల నుండి గ్రామాల అభివృద్ధి కొరకు దామెర గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ప్రతి గ్రామంలోని వాడవాడలో సిసి రోడ్లు ఏర్పరచాలని అహర్నిశలు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికై పాటుపాడుతున్న తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ ( భక్కి ), డాక్టర్ బొల్లె పోగు రమేష్ బాబు, దామెర గ్రామ శాఖ అధ్యక్షులు ఠాకూర్ రామ్ సింగ్, సీనియర్ నాయకులు కడారి రాజేందర్, చల్ల రమణారెడ్డి, గొర్రె చుక్క కొమురయ్య, డాక్టర్ ప్రభాకర్, కరెట్లపల్లి రమేష్, మద్దె రాములు, గొర్రె ఆదాం, గ్రామ ఉపాధ్యక్షులు కడారి సుధీర్, తోట రవి, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.