Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న వారిపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెట్టి, రైడ్ చేసి, పేకాట, కోడి పందాలు ఆడుతున్న వారిని మార్చి 25న అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి7న తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – విజయనగరం ఎస్బీ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు మరియు సిబ్బంది హుకుంపేట శివార్లలో పార్కింగు చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్ ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లుగా నిర్ధారించుకొని, వారిపై రైడ్ చేసి, పేకాట ఆడుతూ పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.12,600/-ల నగదు, ఆరు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అదే విధంగా పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించుకొని, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.15,600/- ల నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్ తో వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.